Tv424x7
National

యూకేలో విజృంభిస్తోన్న “నోరోవైరస్” కేసులు.. వ్యాధి లక్షణాలివే

..యూకేలో ఇటీవల కాలంలో నోరోవైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. బీబీసీ ప్రకారం ఈ నెల ప్రారంభం వరకు దాదాపుగా 1500 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది..గతేడాదడి ఇదే సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం అధిక కేసులు నమోదవుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సాధారణంగా వీటిని ” శీతాకాలపు వాంతుల క్రిమి” అని పిలుస్తారు. ఇది డయేరియాకు కారణమవుతుంది. క్రిస్మస్ ముందు నోరోవైరస్, ఇతర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య గురించి ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.నోరోవైరస్ అంటే ఏమిటి..?నోరోవైరస్ అనేది అంటు వ్యాధి, ఇది వికారం, వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. ఇది ఎక్కువగా కడుపు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ‘స్టమక్ ఫ్లూ’ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తిని కలుసుకుంటే వేరే వారికి కూడా ఈ నోరోవైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. నోరోవైరస్‌కి వ్యాక్సిన్ లేదు..ఇది కడుపు, పేగుల వాపుకు కారణమవుతుంది. దీనిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల తర్వాత లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. చాలా మంది ప్రజలు ఒకటి నుంచి మూడు రోజుల్లో ఈ వైరస్ బారి నుంచి కోలుకుంటారు. ఈ వైరస్‌కి ప్రత్యేకమైన మందులు లేవు. డీహైడ్రేషన్ నివారించడానికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడంతో పాటు లక్షణాలను అనుసరించి చికిత్స చేస్తుంటారు. వ్యక్తుల మలంలో కనీసం రెండు వారాల పాటు వైరస్ ఉంటుందని, చేతులను సబ్బులో శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు చెబుతున్నారు..

Related posts

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

TV4-24X7 News

రవాణాశాఖకు హైదరాబాద్, రంగారెడ్డి నుండి అధిక ఆదాయం

TV4-24X7 News

5 సూత్రాలపై చైనా, అమెరికా మధ్య ఏకాభిప్రాయం

TV4-24X7 News

Leave a Comment