సిద్దిపేట జిల్లా: డిసెంబర్15సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.జిల్లా కలెక్టర్ దగ్గర గన్ మన్‌గా విధులు నిర్వ హిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి అనంతరం తాను కూడా గన్‌తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.ఈ దారుణ ఘటన చిన్న కోడూర్ మండలం రాముని పట్లలో జరిగింది. అయితే రోజువారీగా విధులు నిర్వ హించుకుని ఇంటికి వచ్చిన నరేష్ 9 ఎంఎం పిస్టల్‌తో కుటుంబసభ్యులను కాల్చి చంపాడు.భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ లను పిస్టల్‌తో కాల్చి చంపి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు.

previous post