పులివెందుల లోని “ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి” కార్యక్రమం శుక్రవారము 15 డిసెంబర్ జరిగింది. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్ప నివాళులు అర్పించారు, అనంతరం అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాన్ని సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జయమ్మ, డాక్టర్ నివేదిత, డాక్టర్ సాయి శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్, కుమారి పావన దీప్తి, ఎన్. వి. సుబ్బారెడ్డి, కె. సుబ్బారెడ్డి మరియు కళాశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

next post