Tv424x7
Andhrapradesh

మూడు రోజుల పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్

కడప జిల్లా, పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఈ నెల 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

ఈ నెల 23వ తేదీ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్, తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.

24వ తేదీన వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని ను సందర్శించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం తిరిగి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

ఆలయ అభివృద్ధికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.1.5 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. అలాగే ఎంపీ నిధులతో పాటు ఇతర వనరుల ద్వారా కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దాతల విరాళాలతో కలిపి సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

పర్యటన ముగించుకుని ఈ నెల 25వ తేదీ ఉదయం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Related posts

జగన్ కలయిక పాస్‌ల వివాదం

TV4-24X7 News

కడప జిల్లాలో 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు

TV4-24X7 News

హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా?

TV4-24X7 News

Leave a Comment