Tv424x7
Andhrapradesh

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

బేస్తవారపేట గ్రామీణం: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్‌(20), శ్రీనివాస్‌(21), రాహుల్‌(21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు..

Related posts

సుప్రీంలో మద్యం కుంభకోణం నిందితులకు చుక్కెదురు

TV4-24X7 News

మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయినరైతులను ఆదుకోవాలి..!- ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

వైసీపీకి రాజీనామా చేసిన సినీ నటుడు అలీ

TV4-24X7 News

Leave a Comment