వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు అలీ ప్రకటించారు. రాజకీయాల నుంచి కూడా పూర్తిగా వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇకపై సామాన్య పౌరుడిగానే తాను ఓటు హక్కు వినియోగించుకుంటానన్నారు. గత ప్రభుత్వంలో ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చినా టికెట్ దక్కలేదు. దీంతో అలీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు వైసీపీకి రిజైన్ చేశారు.

