Tv424x7
Andhrapradesh

అంగన్ వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వ సంచలన ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది.

ఎస్మా అంటే..

ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్ కు సంక్షిప్త రూపమే ఎస్మా.. ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. వైద్యం, ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాలలోని సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టం ప్రయోగించవచ్చు.

Related posts

నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

TV4-24X7 News

డిప్యూటీ సీఎం పవన్‌, హోం మంత్రి అనిత భేటీ

TV4-24X7 News

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

TV4-24X7 News

Leave a Comment