జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిషన్.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం సమయంలో పది జిల్లాలు ఉండగా.. పరిపాలన సౌలభ్యం పేరిట వాటి సంఖ్యను 33కు పెంచింది. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి నెల రోజులు పూర్తవుతుంది. ఈ నెలరోజుల్లో తనదైన మార్కు పాలనతో రేవంత్ ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.