Tv424x7
Andhrapradesh

నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ..

తిరుమల..ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. రెండో దఫా జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేపడతాం. మూడో దఫాలో ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి కొరకు కలెక్టరును కోరడం జరిగింది.దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందించినట్టు అవుతుంది. ఈ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుండి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు..

Related posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

TV4-24X7 News

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

TV4-24X7 News

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం

TV4-24X7 News

Leave a Comment