విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది. ఈ సంవత్సరం మంగళవారం గంగమ్మ తల్లి పండగ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మ కు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఉదయం 4 గంటల నుంచి గంగమ్మ తల్లి కి పూజలు 8 గంటలవరకు జరుగును . అనంతరం భక్తులకు దర్శనం చేసుకోటానికి ఏర్పాట్లు జరిగినవి . 15-06-2024 ఉదయం నుంచి సముద్రం లో ఫిషింగ్ బోటులు వేటకు వెళ్లడం జరుగును . కావున ప్రజలందరూ ఈ పండగ ఉత్సవం లో పాల్గొనాల్సింది గా వినయ పూర్వకం గా కోరుచున్నాము. వాసుపల్లి జానకిరామ్ ప్రెసిడెంట్ Ap మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఫిషింగ్ హార్బర్ , విశాఖపట్నం.
previous post

