Tv424x7
Andhrapradesh

ఎమ్మెల్యే ల తలరాత రాసే జీత గాడు ఐప్యాక్

విజయవాడ: 60 నుండి 80 కోట్లు పెట్టి ఎమ్మెల్యే సీటు కొనుక్కోనే ఎమ్మెల్యే రాతను 35వేల రుపాయల ఐప్యాక్ జీత గాడు తల రాత రాస్తున్నాడు.ఇది వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది వాస్తవం.ఈ మధ్య కాలంలో పార్టీలు తమను గెలిపించే షార్ట్ కట్ రూట్ ఐప్యాక్ టీమ్ లని నమ్ముతున్నారు.గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషో్ర్ ను తీసుకోచ్చి విభిన్నమైన తీరుతో చంద్రబాబుకి కోలుకోలేని దెబ్బకోట్టడం జరిగింది.ఆ దెబ్బ ఎటువంటి దంటే పార్టీ లేదు బోక్క లేదు ఆపార్టీ లీడర్లే అనుకునేంతగా దెబ్బ పడింది.నాడు వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను పిలిపించి మాట్లాడేవరకు వచ్చిదంటే ఐప్యాక్ ఏంతగా నేతల్ని ప్రభావితం చేశారో గమనించవచ్చు.గతంలో నిష్పక్షపాతంగా సర్వేలు జరిపిన టీంలు నేడు అదే స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో పని చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఉదాహరణకు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో మల్లాదికి వైసిపి టికెట్ ఇవ్వకుండ మాజి మంత్రి వెలంపల్లికి సెంట్రల్ కేటాయించడం.పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి పెద్ద పెట్టున వ్యతిరేకత వచ్చింది.తరువాత వెల్లంపల్లికి టికెట్ రాదని ఎంతోకంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి అర్థం అయ్యిపోయింది.కాని సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది వ్యతిరేకత చాల తక్కువ అన్ని పార్టిల వారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత.అనుహ్యంగా మల్లాది సీటు కోల్పోవడం ఆయన స్థానంలో వెల్లంపల్లి రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.పైగ అనేక అనుమానలకు తావిచ్చింది.వెల్లంపల్లికి పశ్చిమంలో తన పరిస్థితి అర్థం అయ్యి గత ఐదారునెలల నుండి సెంట్రల్ స్థానిక నాయకలతో మంచి సంభందాలను ఏర్పరచుకున్నాడు..అదే సమయంలో తాడేపల్లి పెద్థల ఆశీస్సులు పొందటం జరిగింది. అదేవిధంగా ఐప్యాక్ ని ప్రభావితం చేసి ఉండోచ్చని అనుమానాలు సామాన్యులకు సైతం కలిగిస్తున్నాయి.ఐప్యాటీం నియోజక వర్గంలో ఎమ్మేల్యేల పని తీరును ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఎమ్మెల్యే భవిష్యత్ నిర్ణయం జరిగుతుంది. సెంట్రల్ నియోజకవర్గంలో విష్ణుకి పెద్దగా వ్యతిరేకత లేదు కొద్దోగప్పో వ్యతిరేక ఉండటం సహజమే.అది పరిగణ లోనికి తీసుకోలేం.సెంట్రల్ లో మల్లాది పని తీరు వెల్లంపల్లితో పోల్చితే ఎన్నో రెట్లు మెరుగు.ఐనా సీటు రాలేదు. ఈ వ్యవహారం సామన్యుడికి సైతం అర్ధం అవుతుంది.ఐప్యాక్ ,తాడేపల్లి పెద్దలు,వెల్లంపల్లి కలిశారు.వెరసి మల్లాదికి వెన్ను పోటు. వెనక్కి తీరిగి చూస్తే వెల్లంపల్లి కూడ ఉన్నారు.

Related posts

టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్

TV4-24X7 News

3కేజీలు ప్లాస్టిక్ సీజ్ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు

TV4-24X7 News

టీచర్ టూ… హోమ్ మినిస్టర్..!

TV4-24X7 News

Leave a Comment