కడప /పులివెందుల శిల్పారామం నందు సంక్రాంతి పండుగను పురస్కరిచుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వించనున్నట్లు పరిపాలన అధికారి సుధాకర్ తెలిపారు. శుక్రవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 14.వ తేది నుండి 16.వ తేది వరకు రోజు సాయంత్రం 5.గంటల 45.ని// నుండి రాత్రి 8.గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు. 14.వ తేది “ప్రభాకర్ విల్లాస్” వారి సహకారంతో మధ్యాహ్నం 3. గంటల నుండి సాయంత్రం 5.గంటల లోపు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని. పోటీలలో గెలిచిన విజేతలకు మొదటి బహుమతి మిక్సీ. రెండవ బహుమతి రైస్ కుక్కర్. మూడవ బహుమతి ప్రెషర్ కుక్కర్ అందించబడతాయని తెలిపారు. అలాగే సాయంత్రం 6.గంటల కు “భోగి మంటలు 5.45.నిమిషాల నుండి రాత్రి 8.గంటల వరకు రాజా కళానిలయం పులివెందుల వారి బృందంచే జానపద మరియు సినిమా పాటలకు నృత్య ప్రదర్శన కలదని తెలిపారు. 15.వ తేది సాయంత్రం 4.గంటల నుండి గాలి పతంగాల పండుగ 5:45. నిమిషాల నుండి రాత్రి 8.గంటల వరకు చిన్నారించే జానపద మరియు సినిమా పాటలకు నృతయరూపకం.
