కడప/కొండాపురం మండలం లో ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ కడప జిల్లా కొండాపూరం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో జనసేన పార్టీ ఆర్థిక సహాయం పశుగ్రాసం కాల్చడం చాలా దుర్మార్గపు చర్య అని జనసేన పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ కోఆర్డినేటర్స్ అల్లం సూర్య నారాయణ, నల్లం శెట్టి నాగార్జున , జమ్మలమడుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ డేరంగుల జగదీష్* మాట్లాడుతూ. ఈ రోజు కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన కోమనూతల నరసింహ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా డేరంగుల జగదీష్ మాట్లాడుతూ నరసింహా కుటుంబానికి చెందిన గడ్డివాములను అన్యాయంగా కొందరు వ్యక్తులు కాల్చి వేయడం జరిగిందన్నారు. ఇలా జరగడం ఇది రెండో సారి అన్నారు. అన్యాయనికి పాల్పడిన వ్యక్తులకు కఠినంగా శిక్షించాలన్నారు. నరసింహా కటుంబానికి జనసేన పార్టీ నుండి ఆర్థిక సహాయం అందించి జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఇంకా మీకు అండగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు మేము ఇక్కడికి వచ్చామన్నారు. గ్రామంలోని ఒక జన సైనికుడికే బయపడుతున్నారంటే నియోజకవర్గంలో ఓటమిని మీరు అంగీకరిస్తున్నట్లే అన్నారు. ఆస్తి,ప్రాణ నష్టానికి మేము వ్యతిరేకులమన్నారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలన్నారు. పశువుల మేతను తగలబెట్టిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి లేదా తగలబెట్టిన గడ్డి వాములను యధావిధిగా నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు శివ కుమార్ ,ముద్దనూరు నాయకులు అరిగేలా కిరణ్ రాయల్, లక్ష్మి నారాయణ, మైలవరం మండల నాయకులు టి. హరినాథ్ రెడ్డి, షైక్ మహబూబ్ బాషా, జమ్మలమడుగు మండల నాయకులు ఆవుల వినయ్ కుమార్, సాయి స్వరూప్ జనసైనికులు పిట్టి విజయరాజు, బిర్రు జాషువా, పొన్నాతోట రాహుల్ బన్నీ, తదితరులు పాల్గొన్నారు
