Tv424x7
Andhrapradesh

పండుగపూట విషాదం

ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది !శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్సు. ఈ తరుణంలోనే… క్లీనర్ దినేష్ (25 ) మృతి చెందాడు..మరో 20 మంది టూరిస్టుకు గాయాలు అయ్యాయి. దీంతో అలర్ట్‌ అయిన స్థానికులు… క్షత గాత్రులను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ నుంచి పూరి, రామేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాశీబుగ్గ పోలీసులు. అదే సమయంలో 54 మంది బస్సులో ప్రయానిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముందు బస్సులోని ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని…కేవలం వెనుక ఉన్న ట్రావెల్స్ బస్సు ప్రయాణికులకు గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు..

Related posts

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు

TV4-24X7 News

జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్.. వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్..!

TV4-24X7 News

చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా

TV4-24X7 News

Leave a Comment