BSP: లఖ్ నవూ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) స్పష్టం చేశారు..సోమవారం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని అన్నారు. అయితే ఎన్నికలయ్యాక పొత్తుకు అవకాశం ఉందని తెలిపారు..ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోరాడినప్పుడల్లా లాభం కంటే ఎక్కువగా నష్టపోయిందని, తమ పార్టీ ఓట్లు ఇతరులకు బదిలీ అవుతున్నాయని అన్నారు. దీంతో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు..

previous post