పులివెందుల ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల కు చెందిన నాల్గొవ సంవత్సర ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు “జాతీయ సేవ పధకం”లో భాగంగా లింగాల మండలం, ఇప్పట్ల గ్రామంలో ‘ప్రత్యేక శిభిరాన్ని’ నిర్వహించనున్నారు. అందులో భాగంగా మొదటి రోజు జాతీయ సేవ పధకం యొక్క ప్రత్యేక శిబిరము ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 17 బుధవరం జరిగింది. ఈ కార్యక్రమం ఏడు రోజులు పాటు జరుగునున్నది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అంకాలమ్మ, సర్పంచ్, విశిష్ట అతిథులుగా ఎన్ సుథీర్, హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ సేవ పధకము కార్యక్రమ అధికారి నజ్మా మాట్లాడుతూ ప్రత్యేక శిబిరములో భాగంగా ఏడు రోజులు జరగబోయే వివిధ కార్యకలాపాల వివరాలు తెలియచేసారు, కళాశాల దత్తత తీసుకున్న గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు గ్రామస్థులతో మమేకం అయ్యి వారి సమస్యల పరిష్కారానికి తమ వంతుగా ప్రయత్నిస్తారని గ్రామస్తులకు తెలిపారు, మొదటి రోజు కార్యక్రమములో భాగంగా ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు గ్రామంలోని సమస్యలు, వారి జీవన విధానం మీద సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇప్పట్ల గ్రామస్థులు, కళాశాల అధ్యాపకులు డాక్టర్ జయమ్మ, కుమారి పావన దీప్తి, డాక్టర్ రాజశేఖర్, ఎన్. వి. సుబ్బారెడ్డి మరియు నాల్గొవ సంవత్సర ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

next post