టిడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ‘రా..కదలిరా’ పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

previous post
next post