అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవల్లిలో ఒకే ఇంటి నంబరుపై వందకుపైగా ఓట్లు ఉండటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. ఊరిలో లేని వారిని సైతం ఓటర్లుగా చేర్చి జాబితాలో వారి ఫొటోలను ముద్రించారు. పోలింగ్ కేంద్రం 91లో 704, 92లో 849 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు.జాబితాను చూసిన గ్రామస్థులు నివ్వెరపోయారు. వారంతా గ్రామానికి చెందిన ఓటర్లు కాదని తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చూడాలని గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.”మా గ్రామంలో ఒకే ఇంటి నంబరుపై వందకుపైగా ఓట్లు ఉన్నాయి. ఊర్లో లేని వారిని ఓటర్లుగా చేర్చారు. జాబితాలో వారి ఫొటోలను సైతం ముద్రించారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం 91లో 704, 92లో 849 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటి నంబరు 1-222ఏ, 1-224ఏ గా వేసి ఫొటోలతో ఓటర్లుగా నమోదు చేశారు. వారంతా మా గ్రామానికి చెందినవారు కాదు. గతంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చూడాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు.” – గ్రామస్థులుమరోవైపు బాపట్ల జిల్లా పర్చూరులో తుది ఓటర్ల జాబితా విడుదల విషయంలో ఎన్నికల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఓటర్ల తొలగింపు, మార్పులకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణను ఎన్నికల సంఘం ఈ నెల 12న నిలివేసింది. దీనికి ముందు రెండు రోజులు 22వేల 381 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తరువాత వరుసగా నాలుగు రోజులు సంక్రాంతి సెలవులు రావటంతో అధికారులు విచారణ చేపట్టలేదని చెప్పారు.

previous post