పులివెందుల లోని “ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు” శుక్రవారం ఘనంగా జరిగాయి. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.ఎస్. బేగ్ జాతీయ పతకాన్ని ఎగరవేసారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.ఎస్. బేగ్ మాట్లాడుతూ భారతదేశం సాధించిన విజయాలు గుర్తుచేశారు, మరియు కళాశాల సాధించిన ఘనతలు, అధ్యాపకులు, విద్యార్థులు సాధించిన విజయాలు తెలియచేసారు. స్టూడెంట్ ఆక్టివిటీ అధికారి డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని, దేశ పౌరుల కర్తవ్యాలను గుర్తుచేశారు. విద్యార్థులు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టూడెంట్ ఆక్టివిటీ అధికారి డాక్టర్ రాజేష్, అధ్యాపకులు డాక్టర్ కీర్తి రెడ్డి, డాక్టర్ నివేదిత కొండేపూడి, డాక్టర్ సాయి శ్రీనివాస్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రవీణ్, కళాశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

previous post