Tv424x7
Andhrapradesh

భారీ అక్రమ మద్యం స్వాధీనం- అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదు- సీఐ చాంద్ బాషా

కడప/వేంపల్లె:గోవా రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వేంపల్లె సీఐ చాంద్ బాషా వెల్లడించారు. శనివారం స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద అక్రమమద్యం సరఫరాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించారు. దీంతో వేంపల్లె పట్టణంలోనీ ఆర్టీసీ బస్టాండు ప్రాంతంలో టీ అంగడి నిర్వహిస్తున్న మోపురి గంగులయ్య వద్ద అక్రమ మద్యం పట్టుబడినట్లు వివరించారు. పోలీసుల కథనం మేరకు వేముల మండలం, కొండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోపురి గంగులయ్య వేంపల్లె పట్టణం, ఉర్దూ షాదిఖాన ప్రాంతంలో నివాసముంటున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండు ప్రాంతంలో టీ అంగడి నిర్వహిస్తున్నారు. అయితే టీ షాపు ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపడాలేనందున.. ఇలా అక్రమ మద్యాన్ని తక్కువ ధరకు గోవా నుంచి తెచ్చి ఇక్కడ అధిక లాభాలకు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని, గోవా నుంచి వేంపల్లెకు తెచ్చుకొని అమ్మేవాడు. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల క్రితం ముద్దాయి మోపురి గంగులయ్య గోవాకు వెళ్లి అక్కడ వివిధ మద్యం దుకాణాల్లో మొత్తం 164 బాటిళ్లను రెండు బ్యాగులతో గోవా నుంచి యర్రగుంట్లకు రైలు ద్వారా..అలాగే అక్కడి నుంచి వేంపల్లెకు తీసుకొచ్చి..శనివారం వాటిని అమ్మేందుకు వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచినట్లు పోలీసులు వివరించారు. అలాగే కేసులో పాల్గొన్న పోలీసు సిబ్బందికి రివార్డు అందజేశామని సిఐ చాంద్ బాషా తెలిపారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైన ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపాల్ నాయక్, ఏఎస్సై శ్రీనివాసమూర్తి, హెడ్ కానిస్టేబుల్ మధుసూదన వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు

TV4-24X7 News

చెడ్డి గ్యాంగ్ ఫొటోలు విడుదల చేసిన ధర్మవరం పోలీసులు.

TV4-24X7 News

తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..!

TV4-24X7 News

Leave a Comment