Tv424x7
Andhrapradesh

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు..ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.కుక్కలకు విశ్వాసం అయినా ఉంటుంది, కానీ నానికి అది కూడా లేదని చురకలు అంటించారు. ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరాడని.. వైసీపీలో నానికి ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడు గా ఉన్న కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరి తోడు దొరకట్లేదన్నారు. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

Related posts

రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

TV4-24X7 News

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో త్వరలో నంద్యాల – చైన్నై బస్సు సర్వీసు ప్రారంభం

TV4-24X7 News

పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అంబుసారంగ్ స్ట్రీట్‌ని తనిఖీ

TV4-24X7 News

Leave a Comment