Tv424x7
Andhrapradesh

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

అమరావతి: సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై చర్చించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరిద్దరి మధ్య అత్యంత కీలకమైన భేటీ జరుగుతోంది..ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీ జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ-జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు అధినేతలు సమావేశమయ్యారు. సంక్రాంతి సందర్భంగా జరగిన డిన్నర్ మీట్‌లో స్థానాలు సంఖ్య, సర్దుబాటు చర్చలు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. అయితే ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సీట్ల సంఖ్యను పెంచాలని జనసేన కోరుతోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో సీట్ల సర్దుబాటుపై అధినేతలు తుదిమెరుగులు దిద్దనున్నారు.కాగా సిట్టింగ్ స్థానాలను ఎమ్మెల్యేలకు కేటాయిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇరుపక్షాల అధినేతలు కలిసి సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రెండు పక్షాల నేతలు మధ్య మేనిఫెస్టోపై చర్చలు ముగియడంతో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు చేయాలనే అంశంపై కూడా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఇరుపక్షాల అధినేతలు కలిసి ఉమ్మడి మానిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించారు. అయితే టీడీపీ సూపర్ సిక్స్, జనసేన ‘షణ్ముఖ వ్యూహం’ రెండింటిని కలిపి ఉమ్మడి మానిఫెస్టోగా రూపొందించనున్నారు. ఇక ఇరుపక్షాల నేతలు కలిపి ఉమ్మడి సభల్లో పాల్గొనడంపై కూడా సంప్రదింపులు జరపనున్నారని తెలుస్తోంది. ఇరుపక్షాల అధినేతలు తాడేపల్లిగూడెంలో పాదయాత్ర నిర్వహించి భారీ బహిరంగసభ నిర్వహణ, సర్దుబాటు పూర్తయిన స్థానాల్లో అభ్యర్థులపై కూడా ఇరుపక్షాల నేతలు మధ్య చర్చలు జరగనున్నాయి..కాగా వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించుకుంటూ పోతున్న వేళ టీడీపీ, జనసేన అధినేతల భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది. ఏయే అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు?, ఏవైనా ప్రకటనలు ఉంటాయా ? అనేది అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది..

Related posts

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న వన్ టౌన్ సీఐ భాస్కరరావు

TV4-24X7 News

2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, పవన్‌ సిద్ధం- మంత్రి అంబటి

TV4-24X7 News

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

TV4-24X7 News

Leave a Comment