Tv424x7
Telangana

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు..పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం శిల్పకళావేదికలో సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..”పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సన్మానం చేయడం గొప్ప విషయం. సీఎం రేవంత్‌ను అభినందిస్తున్నా. గుర్తింపు పొందని వ్యక్తులకు అది లభించేలా పద్మ అవార్డులు ప్రకటించారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఈ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయం. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన కర్తవ్యం మనందరిది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విలువలు పాటించాలి. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు.. చిరంజీవి మూడో కన్ను. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే” అని చెప్పారు..

Related posts

ముగ్గురు మంత్రులకు CM రేవంత్ బిగ్ షాక్..

TV4-24X7 News

రేషన్ కార్డ్ దారులకు త్వరలో సన్న బియ్యం: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

ఈనెల 26న తెలంగాణకు ఉపరాష్ట్రపతి రాక

TV4-24X7 News

Leave a Comment