.
అనంతపురం :తాడిపత్రి /భార్యతో చనువుగా ఉంటూనే ఆమె భర్తను కడతేర్చాలని యత్నించి పోలీసులకు చిక్కిన వైనం* జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు మీడియాకు వివరాలు వెల్లడించిన తాడిపత్రి డీఎస్పీ
అరెస్టయిన నిందితుడి వివరాలు :
గోసాల భాస్కర్, వయస్సు 28 సం., నక్కనదొడ్డి గ్రామం, గుంతకల్లు మండలం.
అరెస్టయిన ఇతనికి ఉరవకొండకు చెందిన వివాహిత సౌభాగ్యతో మూడేళ్ల కిందట ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండీ ఇద్దరూ చనువుగా ఉండేవారు. ఈక్రమంలో తన భర్త, ముగ్గురు పిల్లలు సహా సౌభాగ్య పరిచయమైన 15 రోజులకే తాడిపత్రిలో కాపురం పెట్టింది. అప్పటి నుండీ సౌభాగ్య, గోసాల భాస్కర్ ల మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. ఈవిషయంలో ఆమె భర్త నాగరాజు తరుచూ గొడవపడేవాడు. అంతేకాకుండా ఇతనితోను గొడవలకు దిగేవాడు. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ఆమె భర్త నాగరాజును ఎలాగైనా కడతేర్చాలని గోసాల భాస్కర్ భావించాడు. తనకు పరిచయమున్న చాలా మందితో ఈ విషయం చర్చించి నాగరాజును చంపాలని… అందుకు కిరాయి ఇస్తానని చెప్పినప్పటికీ వారందరూ కూడా ససేమిరా అన్నారు. ఎవరూ ముందుకు వచ్చేలా లేరని భావించి తానొక్కడే కొడవలితో నరికి చంపాలని నిర్ణయించుకున్నాడు. నాగరాజు ప్రతిరోజూ ఉదయం 9.00 గంటలకు సాయిలక్ష్మి అపార్ట్ మెంట్ దగ్గర ఉన్న బీడీల కోసం అంగడికి వస్తాడని తెలుసుకుని ఈరోజు ఉదయం కొడవలితో సిద్ధంగా ఉండసాగాడు. ఈ సమాచారం అందుకున్న తాడిపత్రి యు.పి.ఎస్ సి.ఐ లక్ష్మికాంతరెడ్డి … డీఎస్పీ సి.ఎం గంగయ్య ఆదేశాల మేరకు సిబ్బందితో వెళ్లి గోసాల భాస్కర్ ను అరెస్టు చేసి హత్య కుట్రను భగ్నం చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సి.ఐ ఆధ్వర్యంలో పోలీసు బృందాన్ని అభినందించారు.