హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ‘ఎక్స్'(ట్విటర్) వేదికగా స్పందించారు..”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే తెలంగాణ’ను అధికారిక గీతంగా, సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం” అని పేర్కొన్నారు..

previous post
next post