ఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు (Farmera Protest) రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..ఈ భారీ మార్చ్ (Farmers March)ను అన్నదాతలు మంగళవారం ప్రారంభించారు. ఈ ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో దిల్లీ (Delhi)కి బయల్దేరారు. అటు సంగ్రూర్ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థ దిశగా కదిలింది..ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. ”మేం బారికేడ్లను బద్దలుకొట్టాలనుకోవడం లేదు. చర్చలతోనే మా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. కానీ, వారు (కేంద్రం) మాకు ఏ విధంగా సాయం చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలుపెట్టాం. రోడ్లను బ్లాక్ చేస్తామని మేం చెప్పలేదు. ప్రభుత్వమే అలా చేస్తోంది. పంజాబ్, హరియాణా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దుల్లా కన్పిస్తున్నాయి” అని అన్నారు..

previous post