Tv424x7
Andhrapradesh

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

Nara Lokesh: రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు..విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు..”ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు నా వందనం. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా గెలుపునకు కారణం దొంగ ఓట్లే. వాటిని నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆనాడే చెప్పా. ఏకంగా డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు సస్పెండ్ అయ్యారు. రేపో మాపో విచారణ నివేదిక బయటకొస్తుంది.. వారంతా ఇక జైలుకే. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు” అని లోకేశ్‌ హెచ్చరించారు..

Related posts

కాశీ పుణ్యక్షేత్రం తిరిగి వచ్చిన సందర్భంగా అన్నదానం

TV4-24X7 News

రెడ్ బుక్ కేసు విచారణలో కీలక అప్ డేట్

TV4-24X7 News

ఉచిత నేత్ర వైద్య శిబిరం

TV4-24X7 News

Leave a Comment