Tv424x7
AndhrapradeshCinima News

అర్థంతరంగా ‘రాజధాని ఫైల్స్‌’ నిలిపివేత..

Rajadhani Files: అమరావతి: ‘రాజధాని ఫైల్స్‌’ (Rajadhani Files) సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్థంతరంగా నిలిపివేశారు..హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని నిలదీశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు పేర్కొనగా.. ఆర్డర్‌ కాపీని చూపించాలని పట్టుబట్టారు..మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్‌ వద్ద తెదేపా నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది..

Related posts

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

TV4-24X7 News

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

TV4-24X7 News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

TV4-24X7 News

Leave a Comment