కాంగ్రెస్ కు పూర్వ వైభవం ప్రారంభమైనది.
వైకాపా శ్రేణులారా…? కాంగ్రెస్ లోకి తిరిగి రండి..రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేరుద్దాం….. నర్రెడ్డి తులసీరెడ్డి..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని అయిపొయింది. వైకాపా మునిగి పోయే పడవ అని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైoదని వైకాపా నాయకులు, కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ లోకి తిరుగి రావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చెర్మన్ నర్రెడ్డి తులసి రెడ్డి గారు పిలుపు నిచ్చారు.ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం లో మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తూ చిత్తూ గా ఓడిపోతుందన్నారు.రాష్ట్రo అన్ని వర్గాల ప్రజలు వైకాపా పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.రైతులు రగిలి పోతున్నారు,మహిళలు మండిపోతున్నారు,ఉద్యోగులు ఉడికిపోతున్నారు,నిరుద్యోగులు నిరాశ పడుతున్నారు,సర్పంచ్ లు సలసల కాగిపోతున్నారు,కాంట్రాక్టుర్ లు కాలిపోతున్నారు.వైకాపా పాలనలో రాష్టం అప్పులు, అవినీతి,ఆరాచకం, గంజాయ్, బూతులు,డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందన్నారు.రాష్టం లో ల్యాండ్, స్వాండ్, వైన్, మైన్,ఎర్రచందనం, ఎర్రమట్టి,మాఫియాల రాజ్యం ఏలుతుందన్నారు.జగన్ ఓటమి ఫోభియా పట్టుకుందన్నారు.జగన్ సభలు వెలవెల లాడుతున్నాయ్.రాష్టం లో కాంగ్రెస్ పార్టీకి అరణ్య వాసం ముగిసింది.గత వైభవం తిరిగి ప్రారంభమైనది.మొన్న కర్ణాటక లో కాంగ్రెస్, నిన్న తెలంగాణ లో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారన్నారు.రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయం. ఈ ఆశయ సాధాన కోసం కలిసి కట్టుగా కృషి చేద్దామని అందుకోసం కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయాలని వైకాపా శ్రేణులకు తులసి రెడ్డి గారు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు బరగొడ్ల హుస్సేన్ బాష,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి శంసుల్ హాక్,ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు నజీర్ బాష, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం మల్లేశ్వర్ రెడ్డి,పాపాజి,కాంగ్రెస్ పార్టీ సిరివెళ్ల మండల అధ్యక్షులు పసుపులేటి లక్ష్మి నరసింహుడు, నంద్యాల జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై.సంజీవ కుమార్, మహబూబ్ బాష,తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.