రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో ఓ జవానుపై మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సీఏఎఫ్ కమాండర్‌పై గొడ్డలితో దాడి చేశారు..ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్భ డివిజన్ కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు క్యాంపు నుంచి తేజు రామ్ భూర్య కూరగాయలు తీసుకురావటానికి సిబ్బందితో కలసి బయల్దేరాడు. అకస్మాత్తుగా మావోయిస్టులు అక్కడకు వచ్చి రామ్‌పై గొడ్డలితో దాడి చేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే భద్రతా సిబ్బంది శిబిరంలోని బలగాలను అప్రమత్తం చేశారు. అదనపు దళాలతో సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దుండగులు అక్కడ నుంచి తప్పించుకున్నారు..

previous post