Tv424x7
Andhrapradesh

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

లొక్‌సభ ఎన్నికల వేళ హుజుర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డితో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, జలగం వెంకట్రావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని జలగం వెంకట్రావు అన్నారు. ఖమ్మం అభివృద్ధి చెందడం లేదని చెప్పారు.ఖమ్మం అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలూ ఉన్నప్పటికీ డెవలప్ కావడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ఖమ్మానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. అలాగే, మైనింగ్ కాలేజీని యూనివర్సిటీ చేయలేదని, భద్రాచలం గుడిని అభివృద్ధి చేయలేదని అన్నారు. తమ జిల్లాకు రావాల్సిన నీళ్లు రావడం లేదని అన్నారు.శ్రీనివాస్ గోమాస మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులను ప్రధాని మోదీ కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. పెద్దపల్లిలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తాను వారి గెలుపుకోసం పని చేస్తానని చెప్పారు.క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేస్తానని సైది రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు.లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన నలుగురు కీలక నేతలు

Related posts

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

TV4-24X7 News

తిరుమలలో రీల్స్ చేస్తే.. జైలే!

TV4-24X7 News

ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment