సీఏఏ అమలుపై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం కోసం నిబంధనలను నోటిఫై చేయడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందే ప్రయత్నంలో ప్రధాని మోదీ మునిగిపోతున్న తన నౌకను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ అన్నారు. వారికి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెబుతారని ఎక్స్ ఖాతాలో స్టాలిన్ పేర్కొన్నారు.

previous post