Viveka Murder Case: హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka Murder Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) బెయిల్ (Bail) రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (High Court) అనుమతించింది..ఈ నేపథ్యంలో న్యాయస్థానం అవినాష్ రెడ్డికి వ్యక్తిగతంగా నోటీస్ (Notice) ఇచ్చింది. ఇప్పటికే వకాల్తా వేసిన వివేక కుమార్తె సునీత (Sunitha) పిటీషన్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ (Jada Sravan Kumar) శుక్రవారం కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం కేసు తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది..
