Tv424x7
Andhrapradesh

నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

TDP:పశ్చిమగోదావరి : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ (TDP) తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peetala Sujatha) పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు..అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ”ఎస్సీ, మహిళా కోటాలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ఒక స్థానం కేటాయిస్తారని ఆశించా. నా ఆశ నిరాశే అయ్యింది . 2015 నుంచి నన్ను అణిచివేయడానికి ఎందరో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పార్టీకి నమ్మకస్తురాలిగానే ఉన్నాను.. చంద్రబాబుకి భక్తురాలిని. టికెట్ ఇస్తే ఓడిపోతాను అని వారు అనుకుంటే… నాకు టికెట్ ఇచ్చిన రెండుసార్లు గెలిచాను. ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రాంతాలవారు శాశ్వతం కాదు. నాకు టికెట్ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ పీతల సుజాత వీడియోలో పేర్కొన్నారు..

Related posts

నేషనల్ సేవరత్న అవార్డు అందుకున్న సమ్మిరెడ్డి కృష్ణారెడ్డి, అంకిరెడ్డి మేరీ.

TV4-24X7 News

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కొమ్ము అరుణ కు బత్తిన నవీన్ 5 వేలు ఆర్థిక సాయం

TV4-24X7 News

నాగల చవితి సందర్భముగా వివేకనంద అనాధ ఆశ్రమం వాసులు

TV4-24X7 News

Leave a Comment