Tv424x7
Andhrapradesh

ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ

గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ2019లో జనసేన అభ్యర్థిగా పోటీఇటీవల సొంతంగా పార్టీ పెట్టిన లక్ష్మీనారాయణఈసారి విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జనసేనకు రాజీనామా చేశాక కొంతకాలం రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు. ఈసారి ఎన్నికల్లో తాను విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇవాళ విశాఖ ఎంవీపీ కాలనీలో తమ పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇటీవల జై భారత్ పార్టీ సహా 8 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఈ కూటమికి లక్ష్మీనారాయణ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, జై భారత్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తును కేటాయించడం తెలిసిందే.

Related posts

డిప్యూటీ సీఎం పవన్‌, హోం మంత్రి అనిత భేటీ

TV4-24X7 News

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

TV4-24X7 News

తెలంగాణ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment