తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు చెల్లవని హైకోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. “బస్సు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?” అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఉచితంగా పంచిపెట్టే అంశం కాదని, రాజ్యాంగ నిబంధనలు, చట్టపరమైన పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది.
ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకుంటే అరాచకం, అశాంతి రాజ్యమేలే పరిస్థితులు ఏర్పడతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.