Tv424x7
Andhrapradesh

మాఫియా ముఠాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ప్రభుత్వం

Nara Bhuvaneshwari: కడప: వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) మాఫియా ముఠాలను పెంచి పోషిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) అన్నారు..”నిజం గెలవాలి” (Nijam Gelavali) యాత్రలో భాగంగా కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ”నిజం గెలవాలి” పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె పలువురు కార్యకర్తల కుటుంబాలను కలిశారు.శుక్రవారం నాడు కలసపాడు మండలం బ్రాహ్మణపల్లెలో వెంకటయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ… నాడు చంద్రబాబు జనం మరచి పోలేని అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. నేడు జగన్ పాలనలో గంజాయి, ఇసుక , కల్తీమద్యం, మాఫియాలతో పాటు భూకబ్జాలకు అడ్డగా రాష్ట్రం మారిందని మండిపడ్డారు. ప్రస్తుతం తప్పడు పనుల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. చంద్రబాబు అమలు చేసిన మంచి పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్, ఆయన అనుచరులకు పనికి వచ్చే పథకాలను ఇప్పుడు అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని నారా భువనేశ్వరి పేర్కొన్నారు..

Related posts

శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ

TV4-24X7 News

తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం

TV4-24X7 News

నిన్న శ్యామల ఇవాళ అంబటి – రేవంత్ అంత చులకనయ్యారా ?

TV4-24X7 News

Leave a Comment