మైదుకూరు, జూలై 28: కడప జిల్లా మైదుకూరు మండలం ముత్తరాయపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎల్లయ్య తన భార్య ఎల్లమ్మపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఎల్లయ్య, ఎల్లమ్మ తలపై ఆయుధంతో నరికి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.మృతురాలు ఎల్లమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: