సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన క్లస్టర్ ఇన్‌చార్జి సంజీవరెడ్డి

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప /దువ్వూరు: మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా దువ్వూరు మండలం నీలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని నీలాపురం గ్రామానికి చెందిన సింగిరి విజయమ్మకు ₹1,16,053 విలువైన చెక్కును అందజేశారు.

క్లస్టర్ ఇన్‌చార్జి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సమక్షంలో లబ్ధిదారురాలికి చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోందని తెలిపారు. లబ్ధిదారురాలు సీఎం, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *