ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మైదుకూరు, జూలై 29: మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి బూత్ పరిధిలో “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత మండల టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, యూనిట్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులు సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.అలాగే ప్రతి బూత్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను తప్పనిసరిగా My TDP Appలో అప్‌లోడ్ చేయాలని పార్టీ కార్యాలయం తెలిపింది. ఫోటోలు అప్‌లోడ్ చేయడం ద్వారా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు నమోదు అవుతుందని పేర్కొంది.అందువల్ల సంబంధిత నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని బాధ్యతాయుతంగా విజయవంతం చేయాలని టీడీపీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *