మైదుకూరులో అక్రమ కట్టడాల తొలగింపు.. రైతు బజార్ ఏర్పాటుకు స్థల స్వాధీనం
కడప /మైదుకూరులోని కొత్తకొట్టాలు ప్రాంతంలో అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. రైతు బజార్ ఏర్పాటుకు వీలుగా పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో స్థలాన్ని శుభ్రం చేస్తూ ఆక్రమణలను తొలగిస్తున్నారు.ఈ సందర్భంగా మొత్తం 18 సెట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ స్థలంలో త్వరలోనే రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా రైతు బజార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగగా, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.