స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ఏ వర్గం కూడా సంతోషంగా లేదని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మట్టి మాఫియాలు చెలరేగిపోతున్నాయని విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ వెల్లడించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: