రేపు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు.

గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.30,156 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు అందించనున్నట్లు పేర్కొంది.

రేపు ఉదయం 11.20 గంటలకు జల్ జీవన్ మిషన్ పైలాన్‌ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *