ప్రశాంత వాతావరణంలో తొలి రోజు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

సర్పంచ్ స్థానాలకు 285, వార్డు సభ్యుల స్థానాలకు 281 నామినేషన్లు దాఖలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవాలి: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, నవంబర్ 15: వైఎస్సార్ కడప జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 67 క్లస్టర్ నామినేషన్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.

తొలి రోజు సర్పంచ్ పదవులకు 285 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 281 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు.

ఈ నెల 16, 17 తేదీల్లో కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ నామినేషన్లను సమర్పించాలని సూచించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *