పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు.. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి – జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

కడప, నవంబర్ 14: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు ప్రతినిధులకు మాత్రమే కేంద్రంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు.

నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు.

భద్రతా చర్యల్లో భాగంగా నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కడప

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *