బెంగళూరు బస్టాండులో గుండెపోటు.. చికిత్స పొందుతూ కన్నుమూత
కడప జిల్లా, నవంబర్ 11:బద్వేల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న జే.సీ.ఎస్. రావు (ఉద్యోగి నంబర్: 411584) విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 10వ తేదీ రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో బెంగళూరు–బద్వేల్ ఆర్టీసీ సర్వీసు కోసం బెంగళూరు బస్టాండులో లింక్ తీసుకుంటున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం బెంగళూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన మృతి చెందినట్లు బద్వేల్ డిపో మేనేజర్ వెల్లడించారు.
విధి నిర్వహణలోనే డ్రైవర్ మృతి చెందడం ఆర్టీసీ సిబ్బందిలో విషాదాన్ని నింపింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: