పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల కీలక ప్రకటన

పరస్పర అంగీకారంతో వైవాహిక బంధానికి ముగింపు.. స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు కీలక ప్రకటన చేసినట్లు వెల్లడించారు. పరస్పర అంగీకారం, గౌరవాన్ని ప్రాతిపదికగా తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

వైవాహిక బంధం ముగిసినప్పటికీ ఒకరిపై మరొకరికి గౌరవం కొనసాగుతుందని, భవిష్యత్తులో మంచి స్నేహితులుగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పిల్లల సంతోషం, వారి భవిష్యత్తు తమ ఇద్దరికీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని స్పష్టం చేశారు.

Oplus_131072

ఈ వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల కృతజ్ఞతలు తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *