ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం.. ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 5న నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు వర్తించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో 50 వేలకు పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 మంది అభ్యర్థులు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: