రాప్తాడు పాఠశాలలో దాడికి గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని
రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో జరిగిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు.
ప్రస్తుతం గోపిక బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు సమాచారం.
విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జగన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: