సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు భారీ బందోబస్తు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు భారీ బందోబస్తు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

2 వేల మంది పోలీసులతో భద్రత.. డ్రోన్లతో ప్రత్యేక నిఘా | నాలుగు జిల్లాల ఎస్పీలతో సమన్వయం

ప్రొద్దుటూరు, కడప జిల్లా:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం (అక్టోబర్ 5) ప్రొద్దుటూరులో నిర్వహించనున్న పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ తెలిపారు.

ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ఫంక్షన్ హాలులో పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. పర్యటన మార్గం, బహిరంగ సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, వీఐపీ ప్రవేశ ద్వారాల వద్ద ముందస్తు భద్రతా తనిఖీలు పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో, సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, డైవర్షన్లు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.

ఈ సమావేశంలో అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విబు కృష్ణ ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్‌తో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *